సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:రాష్ట్ర మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు స్ధానిక మండల న్యాయ సేవా సంస్ధ, రెవిన్యూ, మునిసిపల్, మహిళాభివృధ్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, కార్మిక, విద్య, వైద్య, దివ్యాంగులు, పోలీసు, అటవీ, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, ఆరోగ్య తదితర శాఖల సమన్వయంతో నేడు, శనివారం భీమవరం SRKR ఇంజనీరింగ్ కాలేజీలో 3వ అదనపు జిల్లా జడ్జి , డాక్టర్ B.లక్ష్మి నారాయణ అధ్యక్షతన న్యూ మాడ్యుల్ లీగల్ సర్వీసెస్ క్యాంపు నిర్వహించారు. SP అద్నాన్ నయీం అజ్మీ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు యేలేటి న్యూటన్ లను వేదికపైకి 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి P.హనీష ఆహ్వానించారు. B.లక్ష్మి నారాయణ మాట్లాడుతూ.. ఇంట్లో పనిచేసే మహిళలు కూడా అసంఘటిత కార్మికులేనని, అసంఘటిత కార్మికుల హక్కుల పరిరక్షణకు 2015లో చట్టం రూపకల్పన చేసిందని, వారి హక్కులకు తమ సేవా సంస్థలు వారికి అండగా వుంటాయని, ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని, అన్నారు. సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) K.రత్న ప్రసాద్, మాట్లాడుతూ “బాలల ప్రయోజనాల కొరకు న్యాయ సేవా సంస్ధలు కృషి చేస్తున్నాయని, అన్నారు. తదుపరి, వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్ లను న్యాయమూర్తులు సందర్శించారు. పోలీసు శాఖ హిట్ అండ్ రన్, శక్తి యాప్, విక్టిమ్ కాంపన్సేషన్ కేసుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగులకు వీల్ చైర్లు, సదరం సర్టిఫికెట్స్ పంపిణీ చేసారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ చేసారు. వివిధ శాఖల పెండింగు చెక్కులు పంపిణి చేసారు. సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల ఉత్పత్తులు పరీశీలించి అభినందించారు. . 2వ అదనపు జుడీషియల్ మొదటి తరగతి మేజస్ట్రేట్ N.జ్యోతి వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది.
