సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:ఆంధ్రప్రదేశ్ లోని మన్యం జిల్లా , పార్వతీపురం లో నేడు, ఆదివారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు నుంచి ఏఎన్ఎల్ పార్సిల్‌కి వచ్చిన సామాన్లు దించుతుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలోఆ బస్సు అద్దాలు, సామాగ్రి ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి కూడా స్పల్ప గాయాలయ్యాయి. క్షతగ్రాతులని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఇరువురిని విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు అందవలసి ఉంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఈ ప్రమాదానికి కారణం బాణాసంచా పేలుడా?లేక ఏమైనా బాంబులు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
