సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 10 మంది మృతి చెందటం అనేక మంది గాయపడటం పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మాజీ సీఎం జగన్ తన తీవ్ర దిగ్బ్రాంతి ని వ్యక్తంచేస్తూ స్థానిక వైసీపీ శ్రేణులు అక్కడకు చేరుకొని బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని పిలుపు నిచ్చారు. తాజాగా ప్రధాని మోదీ తీవ్ర దిగ్ర్భాంతి (PM MODI) వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటన జరగడం చాలా బాధాకరం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని” మోదీ అన్నారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున పరిహారం అందిస్తామని PMO కార్యాలయం ప్రకటన చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *