సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం (జనవరి 19 న) భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో జిల్లాలోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ నిర్వహించారు. వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను ఎస్పీ అద్నాన్ నయీం స్వయంగా స్వీకరించి వారి సమస్యలను విని, సానుకూలంగా స్పందించి, వారి సమస్యలపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కారం అందిస్తామని భరోసా ఇచ్చారు.సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి అర్జీదారుల సమస్యలను చట్ట పరిధిలో విచారించి నిర్ణిత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. వివిధ సమస్యలతో పోలీస్ కార్యాలయాలకు వచ్చే బాధితులకు భరోసాగా పోలీస్ శాఖ ఉండాలన్నారు. అర్జీలు మరల మరల పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో విచారించి శాశ్వతంగా పరిష్కారం చూపాలని ఎస్పీ పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈరోజు నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, భర్త/అత్తారింటి వేధింపులు,భూ-ఆస్థి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్లైన్ మోసం,ప్రేమ పేరుతో మోసం, ఆస్థి తగాదాలు,ఇతర పలు సమస్యలపై మొత్తం 13 అర్జీలను ఎస్పీ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వి. భీమారావు, భీమవరం డీఎస్పీ, రఘువీర్ విష్ణు , జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కె.వి.వి.ఎన్ సత్యనారాయణ, డి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్ దేశంశెట్టి వెంకటేశ్వరరావు , వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఎం.నాగరాజు మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
