సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రారంభమైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) పథకం దేశవ్యాప్తంగా కోట్లాది మంది పేదల సొంతింటి కలను నిజం చేసిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కొనియాడారు. పాలకొల్లు నిర్మించిన 2016 టిడ్కో ఇళ్ల గృహప్రవేశాలు నేడు సోమవారం అటహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, మంత్రి నిమ్మల రామానాయుడు శిలాఫలకాన్ని, గృహ సముదాయాలను ప్రారంభించారు. శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. 2015లో కేంద్రమంత్రి ఉన్న వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఉన్న ప్రత్యేక మమకారంతో ఇతర రాష్ట్రాల కంటే మన రాష్ట్రానికే అత్యధిక గృహాలను కేటాయించినట్లు గుర్తు చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యం కారణంగా టిడ్కో (TIDCO) గృహాల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, అయితే 2024 ఎన్నికల్లో ప్రజలు ఎన్డీయే (NDA) కూటమికి పట్టం కట్టడం వల్లే నేడు తిరిగి పేదల ఇళ్ల కల నెరవేరుతోందని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ అన్నారు.
