సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మున్సిపాలిటీ పరిధిలో తాడేరు సమీపంలో నిర్మించిన ఇటీవల పూర్తీ అయిన 1920 టిడ్కో గృహాలకు నేడు, సోమవారం సామూహిక గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు లబ్ధిదారులకు గృహాలను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. ప్రతి పేదవానికి సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) పథకం క్రింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా బృహత్తర గృహ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాయని తెలిపారు. సామూహిక గృహప్రవేశాల ద్వారా లబ్ధిదారులకు అందజేయడం సంతోషకరమని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన కాలనీల్లో రేషన్, ఎల్పిజి గ్యాస్ సరఫరా వంటి మౌలిక సేవలు నిరంతరంగా అందించ బడతాయని, కాలనీ వాసులు పరిశుభ్రతను కాపాడుకోవాలని సూచించారు. పొడి, తడి చెత్తను వేర్వేరుగా డస్ట్ బిన్లలో వేయాలని, కాలనీని పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. ఇంకా గృహాలు పొందని లబ్ధిదారులకు జూన్ – జూలై నెలలలోపు గృహాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్, TDP పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఆర్డీవో కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ అధికారులు, కూటమి నాయకులు, లబ్ధిదారులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *