సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్టీఆర్ తో కలసి చేసిన RRR అఖండ విజయం తరువాత వరుసగా ఆచార్య, గేమ్ చేంజెర్’ వంటి దారుణ పరాజయాలతో గత 5 ఏళ్లుగా హిట్ లేని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan) 2 ఏళ్ళు పాటు బంపర్ హిట్ కొట్టి తీరాలని ఎంతో కసిగా పనిచేసిన ‘పెద్ది’ ఇప్పటికే పలు మారులు రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది. అగ్ర దర్శకుడు సుకుమార్ శిష్యుడుగా తొలిసినిమా ‘ఉప్పెన’ (Uppena) సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu ) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇదొక మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కేవలం ఒక్క పాట మినహా మిగతా టాకీ పార్ట్ అంతా పూర్తయినట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారుప్రస్తుతం చిత్రయూనిట్ ఆ మిగిలిపోయిన స్పెషల్ సాంగ్లో రామ్ చరణ్‌, శృతి హాసన్ లతో కల్సి మంచి మాస్ స్టెప్పులేస్తున్నట్టు సమాచారం.ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ,చాల బిన్నమైన ‘అప్పల సూరి’గా వృద్ధుడి గెటప్ లో ‘జగపతి బాబు’ కీలక పాత్రలలో నటిస్తుండటం, ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఇప్పటికే విడుదలైన పాటలు దుమ్ము లేపుతున్నాయి. ఇక ఈసారి మేకర్స్ జూన్ నెలలో సినిమా రిలీజ్ చేస్తామని అధికారిక ప్రకటన చేశారు. ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం, జూన్ 25వ తేదీన (Peddi ) ‘పెద్ది’ థియేటర్లలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *