సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళా ఖాతం లో ఇటీవల ఏర్పడిన అల్పపీడనం వల్ల గత 4రోజులుగా ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలలో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. ఈ అల్పపీడం నైరుతి రుతుపవనాల సీజన్‌లో మొదటి వాయుగుండం గా మారి ఒడిస్సాలో తీరం దాటింది. రెండు రోజుల క్రితం ఉత్తర ఒడిస్సా పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిస్సాలోని బాలాసూర్‌కు సమీపంలో తీరం దాటింది. మరల గోదావరి జిల్లాలలో నేడు, సోమవారం నుండి భానుడు ప్రచండంగా మారిపోయాడు.
