సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇప్పటికే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా, పోలవరం జిల్లాగా మొత్తం 3 జిల్లాలుగా విడిపోయిన నేపథ్యంలో ఏపీలో మొత్తం 28 జిల్లాలు ఏర్పడ్డాయి. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఏపీలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో జిల్లా కలెక్టరేట్ లలో సిబ్బంది తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఒక్కో జిల్లా కలెక్టరేట్లో ప్రస్తుతం 95 పోస్టులు ఉండగా.. ఇకపై అన్ని జిల్లా కలెక్టరేట్లలోఒకే సంఖ్యలో 85మంది మాత్రమే ఉద్యోగులు పనిచేస్తారు. ఈ 85మందిలో రెగ్యులర్ ఉద్యోగులు 53, ఔట్ సోర్సింగ్ 32 మంది ఉద్యోగులు ఉండేలా ఉత్తర్వులు జారీ చేశారు.అంటే ఏపీలోని అన్ని జిల్లా కలెక్టరేట్లలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్వో, డిప్యూటీ కలెక్టర్, ఏవో, సూపరింటెండెంట్స్, డిప్యూటీ తహసీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్, జమేదార్, కంప్యూటర్ ఆపరేటర్, డ్రైవర్లు , ఆఫీస్ సబార్డినేట్స్, వాచ్మెన్ పోస్టులను నియమిస్తారు. పాత జిల్లాల్లో ఉన్న మిగులు పోస్టుల్ని కొత్తగా ఏర్పాటు చేసిన మార్కాపురం, పోలవరం జిల్లాలకు సర్దుబాటు చేయాలని నిర్ణయించారు.
