సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ముంబయిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని చికిత్స పొందుతున్న ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను నేడు, ఆదివారం సీఎం చంద్రబాబు స్వయంగా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడం పట్ల సంతోషం వ్యక్తం చేసి, పవన్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకోవడంతో పాటు కొంతసేపు ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడారు. త్వరగా కోలుకుని ప్రజాసేవలోకి తిరిగి రావాలని ఆకాంక్షించారు. చంద్రబాబు వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను తెలుసుకున్న సీఎం.. వైద్యుల సూచనలను పాటిస్తూ పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *