సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రధాన మంత్రి మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్‌ పర్యటన రేపు శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. ఆయన విదేశాల నుండి తిరిగొచ్చిన అనంతరం వివిధ రాష్ట్రాలలో గవర్నర్ల బదిలీలు, కొత్త నియామకాలు, కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, బీజేపీ పార్లమెంటరీ బోర్డు నియామకం జరుగుతుందని ఢిల్లీ లో రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. దీనిలో భాగంగా ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ పదవి లభించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయన 2024 ఎన్నికలలో రాజంపేట లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసి వైసీపీ ఎంపీ మిదున్ రెడ్డి చేతిలో ఓడిపోయినప్పటికీ ఆయనకు తగిన గౌరవం ఇవ్వాలని బీజేపీ కేంద్ర నేతలు భావిస్తున్నారు. బహుశా తమిళనాడు కానీ ‘తెలంగాణ’ కు గవర్నర్ చేసే అవకాశం పరిశీలన లో ఉన్నట్లు? భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *