సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం ఉదయం పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. ఆటోను ఢీకొని ఏడుగురు మృతి చెందడం, పలువురు తీవ్రంగా గాయపడటం కుటుంబాలలో తీవ్ర విషాదం నింపింది. దీనిపై సీఎం చంద్రబాబు. పవన్ కళ్యాణ్, లోకేష్ లు మాజీ సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం అధికారులకు ఫోన్ చేసి ప్రమాదం గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మృతి చెందిన వారు చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామస్థులుగా అధికారులు వివరించారు. తీవ్రంగా గాయపడిన వారిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *