సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేపాల్లో ప్రళయంలా విరుచుకుపడిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఎన్నో వేలమంది గల్లంతు కాగా, టిబెట్ సరిహద్దుకు సమీప ప్రాంతాల్లో ఈ విపత్తులో ఇప్పటివరకు అధికారికంగా 157 మంది మరణించారు. అయితే . ఈ ఘటనలో భారతీయ యాత్రికులు కూడా చిక్కుకోవడం ఆందోళన కలిగిస్తోంది పవిత్రమైన కైలాష్ మానసరోవర్ యాత్రకు వెళ్లిన 133 మంది భారతీయ యాత్రికులు గల్లంతైనట్లు వార్తలు వస్తున్నాయి. కైలాష్ మానసరోవర్ యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో పలువురు భారతీయ యాత్రికులు వరదల్లో చిక్కుకున్నట్లు సమాచారం. వారి ఆచూకీ కోసం నేపాల్ భద్రతా బలగాలు, రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. తమ బృందానికి చెందిన 80 మంది ఆచూకీ తెలియడం లేదని తమిళనాడుకు చెందిన సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆవేదన వ్యక్తం చేశారు.
