సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత నెల రోజులుగా పశ్చిమ గోదావరి జిల్లాలో సామాన్యుల కు నిత్యావసర కాయగూర అయిన ఉల్లి పాయలధర ధర మండుతోంది. ఒక్కసారిగా కిలో ఉల్లి 30 రూపాయలు నుండి వారానికి 10 చప్పున ధరలు పెంచుకొంటూ పోతూ ప్రస్తుతమ్ కేజీ రిటైల్ ధర 70 రూపాయలకు చేరింది. . రిటైల్‌గా రూ.వందకు కిలోన్నర ఉల్లిని అమ్ముతున్నారు.. ఉల్లి దిగుమతి కి జిల్లాలో ప్రధాన తాడేపల్లి గూడెం మార్కెట్ లో క్వింటా ఉల్లి హోల్‌సేల్‌ ధర అత్యధికంగా రూ.4500 పలికిందంటే పరిస్థితి అర్దమవుతోంది. పంట దిగుబడి తగ్గటంతో గతంలో కర్నూ లు నుంచి తాడేపల్లిగూడెం మార్కెట్‌కు రోజుకు 100 కు పైగా ఉల్లిలోడుతో లారీలు వచ్చేవి. ఇప్పుడు 5 లారీల లోపు రావడం గగనం అయ్యింది. ఇక మహారాష్ట్రా నుండి వచ్చే ఉల్లి మాత్రమే అదనపు దిగుమతి చార్జీలు భారంతో జిల్లా ప్రాంత వసూలుకు దిక్కు అవుతుంది. దానితో జిల్లా వ్యాప్తంగా ఉల్లి ధర పెరిగిపోయింది. నిత్యావసర పంచదార ధర కూడా కేజీ 44 నుండి పెరిగిపోయి 70 రూపాయలకు చేరుకోవడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *