సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక ప్రక్క స్థానిక సంస్థలు ఎన్నికలు సీజన్ ప్రారంభం అవుతున్న వేళా..ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారు 2న్నర ఏళ్లకు తొలిసారి నేడు సోమవారం నుంచి ‘ఎన్టీఆర్ భరోసా‘కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు వివిధ కారణాలతో పింఛన్లు రానివారికి. కొత్తగా అర్హత సాధించిన వారికి , వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులకు నూతన పింఛన్లు మంజూరు చేయనున్నారు. ఇందుకోసం సోమవారం నుంచి కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 16వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. తదుపరి సెప్టెంబర్ 22వ తేదీ నుంచి సెప్టెంబర్ 24వ తేదీ వరకూ దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి..శాఖాపరమైన ధ్రువీకరణ ప్రక్రియ ఉంటుంది. అలాగే అర్హతలపై నిర్ణయం తీసుకుంటారు. సెప్టెంబర్ 25 నుంచి సెప్టెంబర్ 26 వరకూ రెండు రోజుల పాటు సెర్ప్ ద్వారా బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పిస్తారు. దీనికి ప్రభుత్వ ఆమోదం ప్రక్రియ ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
