సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఉపాలయము శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి వినాయక చవితి వేడుకలు ప్రారంభ నేపథ్యంలో నేడు, ఆదివారం భీమవరంకి చెందిన గిన్నీ రామకుమారి రెండు లక్షల యాభై వేలు విలువ చేసే ఒక కేజి ముప్పై ఏడు గ్రాముల 1037 గ్రాముల వెండి పాలవెల్లి కానుకగా సమర్పించారు. అలాగే శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్రం ప్రాజెక్ట్ కు కొత్త పూసలమొర్రు కి చెందిన SI పద్మారావు 4 గ్రాముల బంగారం మరియు శ్రీ అమ్మవారి శాశ్వత నిత్యాన్నదాన వితరణకు హైదరాబాద్ కి చెందిన బి శ్రీ ఉజ్వల్ రెడ్డి 50,000 రూపాయలు కానుకగా అందించారు. వీరందరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం మరియు ధర్మకర్త రామాయణం శ్రీనివాస్ శేషవస్త్రం ప్రసాదం ఫోటో అందజేశారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *