సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగాఈ వర్షాకాలం సీజన్ లో తొలిసారి గత 3రోజులుగా చెదురుమదురు వర్షాలు పడుతున్నాయి. నేటి ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు వర్షపు జల్లులతో ముసురు వాతావరణం నెలకొంది. రేపటి శ్రీ వినాయక చవితి కి వర్షం ఆహ్వానం పలికే అవకాశం ఉందిమొత్తానికి వినాయకుడు మొండి వర్షాలను తన వెంట బెట్టుకొని వస్తున్నారు.. వినాయక విగ్రహాలు అమ్మే వారు, పూజ సామాగ్రి అమ్మేవారు వర్షం ముసురులో తగిన ఏర్పాట్లు మధ్య అమ్మకాలు కొనసాగితున్నారు.పూజ సామాగ్రి ధరలు, పువ్వుల ధరలు మాత్రం అంబరాన్ని తాకుతున్నాయి. ఈసారి భీమవరం 2 టౌన్ లో కాస్త నెమ్మిదించిన, వన్ టౌన్ మెంటేవారి తోట , గునుపూడి లలో యువత పోటాపోటీగా భారీ పందిళ్ళలో వినాయక విగ్రహాలను ఏర్పాట్లు చేసుకొంటున్నారు. రేపు కూడా అల్పపీడన ప్రభావంతో దీని ప్రభావంతో రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, గోదావరి జిల్లాలలో ఒక మోస్తరు వర్షాలు పడనున్నాయి.
