సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్శన్ S.శ్రీదేవి నేడు ఆదివారం భీమవరం ప్రత్యేక ఉపకారాగారాన్ని సందర్శించి ముద్దాయిలతో మాట్లాడి వారి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అందరికీ న్యాయవాదులు ఉన్నారా? అని ఆరా తీసారు. వారిలో కొందరికి న్యాయ వాదిని పెట్టుకునే ఆర్ధిక స్థోమత లేకపోతే ప్రతీ బుధవారం, శనివారం జైలుకు వస్తున్న ఉచిత న్యాయవాదికి, పారా లీగల్ వాలంటీర్ కు తెలియజేస్తే ముద్దాయిల తరఫున అర్జీ వ్రాసి కోర్టు దృష్టికి తీసుకువచ్చి న్యాయవాదిని ఏర్పాటు చేయిస్తారన్నారు. న్యాయమూర్తి జైలు పరిసరాలను, బ్యారక్, వంటగదిని పరిశీలించారు. ముద్దాయిలకు పెట్టే భోజనాన్ని రుచి చూసారు. పోలీస్ సిబ్బందికి తగిన సూచనలు చేసారు న్యాయ సేవాధికార సంస్ధ కార్యదర్శి N. శ్రీలక్ష్మి, భీమవరం 2వ అదనపు మొదటి తరగతి మేజిస్ట్రేట్ N. జ్యోతి, ప్యానల్ న్యాయవాదులు K. వెంకటరమణ, B. సంతోష్, పారా లీగల్ వాలంటీర్లు గౌరి, కాళేశ్వరి, జైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
