సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, ఆదివారం భీమవరం – ఉండి రోడ్డులో ఎంకే ఈవి హబ్ ఛార్జింగ్ స్టేషన్, కార్ వాష్ ను ఆదివారం, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యే అంజిబాబు సంయుక్తంగా ప్రారంభించి మాట్లాడారు.ఇటీవల దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువయ్యిన నేపథ్యంలో ఈవి ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు చేయడమంటే వాహనదారులకు భరోసా కల్పించినట్లేనని, ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులోకి రావడం వల్ల లాంగ్ డ్రైవ్స్ కు వెళ్లే వారికి ఛార్జింగ్ అయిపోతుందనే భయం తప్పుతుందని అన్నారు. ఇక్కడ 35 నిమిషాల్లోనే వాహనాలకు పూర్తి ఛార్జింగ్ అవుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం కూడా ఆ దిశగా ప్రోత్సహిస్తున్నాయన్నారు. మన ప్రాంతంలో ఈవి చార్జింగ్ స్టేషన్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
