సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరంలో పర్యటించి ప్రాజెక్ట్ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులను పరిశీలించి.. పనుల పురోగతిని ప్రాజెక్టు అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. రైట్ కనెక్టివిటీ పనులు ఈ నెలాఖరు నాటికి, లెఫ్ట్ కనెక్టివిటీ పనులు నవంబర్ నాటికి పూర్తి కానున్నాయని తెలిపారు.రూ.536 కోట్లతో చేపట్టిన కుడి, ఎడమ గట్ల అనుసంధాన పనులు జరుగుతున్నాయని చెప్పారు. 2024 జూన్ తరువాత 10,491 ఎకరాల భూసేకరణ చేశామని అన్నారు.అక్కడి . నిర్వాసితులకు రూ.2,250 కోట్ల పరిహారాన్ని అందించామని వివరించారు. గత వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క ఎకరం భూమి కూడా సేకరించ లేదని ఆరోపించారు. అలాగే ప్రాజెక్టు నిర్వాసితులకు ఒక్క రూపాయి పరిహారం కూడా అందించలేదన్నారు. కేంద్రం ఇచ్చిన రూ.3,850 కోట్ల రియింబర్స్‌మెంట్ నిధులను ప్రాజెక్టుకు ఖర్చు చేయకుండా దారి మళ్ళించారని ఆరోపించారు..రానున్న మూడేళ్లలో రూ.35 వేల కోట్లు ఖర్చు చేసి 36 ప్రాజెక్టులు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టారని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *