సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో నేటి సాయంత్రం నుండి మూడు పాటు రాష్ట్రంలో పిడుగుపాటులు ఉంటాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాలో ఉరుములతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఉత్తాంధ్ర మరియు గోదావరి జిల్లాలు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లావాసులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. ముఖ్యంగా , శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, గుంటూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
