సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల గత 3 వారాలుగా భారీ నష్టాలు లేదా స్వల్ప లాభాలు తో కుదేలు అవుతున్న భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు, గురువారం కూడా అదే ధోరణి కొనసాగించింది. రోజంతా తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగి చివరకు మిశ్రమ ఫలితాలు, స్వల్ప నష్టాలతో ముగిశాయి. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు, అంతర్జాతీయ మార్కెట్ సంకేతాల నేపథ్యంలో బెంచ్ మార్క్ సూచీలు పరిమిత శ్రేణిలోనే ట్రేడ్ అయ్యాయి.నిఫ్టీ 53.00 (0.23శాతం) పాయింట్లు పెరిగి 23,270.60 దగ్గర ముగియగా, సెన్సెక్స్ 21.86 (0.029శాతం) కోల్పోయి 74,314.59 దగ్గర ముగిసింది
