సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేడు శుక్రవారం 582 జెడ్పీటీసీ.. 7,767 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు పోలింగ్ ప్రారంభం కావడంతో గ్రామీణ ఓటర్లు తమ ఓటు హక్కు ను వినియోగించుకొంటున్నారు. ఈ ఎన్నికల పోటీలో మొత్తం 21,012 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 31,460 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.ఎన్నికల విధుల్లో దాదాపు 2.52 లక్షల మంది సిబ్బంది పాల్గొంటున్నారు. అయితే ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో.. 5 మండలాల్లో పోలింగ్‌ వాయిదా వేశారు.వేలేరుపాడు, బుట్టాయగూడెం.. జీలుగుమిల్లి.. పోలవరం.. గోపాలపురం మండలాల్లో పోలింగ్‌ వాయిదా వేశారు. మిగతా అన్ని ప్రాంతాలలో ఓట్ల పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.. ఈ నెల 7న ఓట్ల లెక్కింపు ఉంటుంది.రాయలసీమ పలు గ్రామాలలో టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. రైల్వే కోడూరులో, పులివెందుల కడప జిల్లాలో బాంబు దాడులు వరకు పరిస్థితి వెళ్ళింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *