సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అంధ్ర ప్రదేశ్ లో ఇటీవల పట్టణ ప్రాంతాల ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు.. మేయర్లు, చైర్ పర్సన్ల , కౌన్సెలర్స్ ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారైంది. ఈ నెల 23న కొత్తగా ఎన్నికైన వారంతా బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో కొత్త పాలకవర్గాల ఏర్పాటు ప్రక్రియలో మొదటి ఘట్టం పూర్తి కానుంది.అయితే డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్పర్సన్ల ఎన్నికపై విధివిధానాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ప్రత్యేకంగా ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఏపీలో 13 కార్పొరేషన్లు, 77 కార్పొరేషన్లు, 10 నగర పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. వీటిలో దాదాపు అన్ని చోట్ల కూటమి పార్టీ అభ్యర్థులు విజేతలు కాగా పరిస్థితులు అనుకూలించకపోయిన ఏటికి ఎదురు ఈది ప్రతిపక్ష వైసీపీ మాత్రం అనంతపురం మేయర్ స్థానంతో పాటు మూడు మున్సిపాలిటీ లను. నందికొట్కూరు, బేతంచర్ల, నాయుడపేటలో వైఎస్సార్సీపీ ఛైర్పర్సన్ అభ్యర్థులు విజయం సాధించారు.
