సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో కుండపోత వర్షాలు నేపథ్యంలో స్థానిక లూథరన్ హైస్కూల్ గ్రౌండ్స్ పరిస్థితి అనుకూలంగా లేకపోవడం తో ఈసారి దీపావళి బాణాసంచా షాపులు విక్రయ కేంద్రాలు స్థలం స్థానిక బైపాస్ రోడ్డులోని మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసం ఉన్న ప్రాంతానికి మారింది. దశాబ్దాలుగా ఎన్ని బాణాసంచా షాపులు వచ్చినప్పటికి భీమవరంలో స్థానిక ప్రజలలో దశాబ్దాలుగా నమ్మకమైన బాణాసంచా అమ్మకాలు నిర్వహించే ‘వరుణ సూపర్ బజార్’ స్టాల్ కు ప్రత్యేక స్తానం ఉంది. నాణ్యమైన నెంబర్ 1 బ్రాండెడ్ బాణాసంచా సరకు అమ్మకాలతో పాటు నిజమైన హోల్ సెల్ ధరలకు అమ్మే షాప్ గా ఒక ప్రత్యక గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో..ఈసారి షాప్ నెంబర్ 1 లో “వరుణా సూపర్ బజార్” వారి దీపావళి బాణాసంచా షాప్ ను నేడు,గురువారం ఉదయం టీడీపీ సీనియర్ నేత మెంటే పార్ధసారధి, పూజ కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. అత్యంత నాణ్యత కలిగి ఉన్న అయ్యన్ బ్రాండెడ్ సరికొత్త వైరిటి బాణాసంచాను అందరికి అందుబాటులో విక్రయిస్తున్నట్లు తెలిపారు.. భీమవరం ప్రజలు సురక్షితమైన జాగ్రత్తలు తీసుకోని దీపావళి పండుగ జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లం వీరాస్వామి, ‘వరుణ’ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *