సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అయితే అతి వృష్టి లేకపోతె అనావృష్టి అన్నట్లు ఉంది పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు పరిష్టితి. వరుసగా 6నెలలు పాటు ఎండాకాలం చవిచూశారు. ఇటీవల వరుస 2 తుపాను లు ఎదుర్కొన్నారు. గత 10 రోజులుగా వర్షపు ముసురు తప్ప ఎండ మొఖం చూడని భీమవరం ప్రజలు నేడు,గురువారం మంచి తీవ్రమైన భానుడి తాపాన్ని ఆనందంగా ఎదుర్కొంటున్నారు. పెనుగాలులతో భారీ వర్షం తో అస్తవ్యస్తంగా మరీన పట్టణంలో ఇప్పటికి పరిస్థితులు చక్కబడలేదు.చాల రోడ్డు సైడ్ హోటల్స్ కర్రీ పాయింట్స్ పూర్తిగా తెరుచుకోలేదు.. మునిసిపల్ పారిశుధ్య కార్మికులు , ప్రోకెయిన్ లతో చెత్తను తొలగించేవారు బాగా శ్రమిస్తున్నప్పటికీ తగినంత మంది లేకపోవడం కూడా ప్రధాన కారణంగా కనపడుతుంది. భీమవరం లోతట్టు మెంటేవారి తోట, ఇందిరపురం, దుర్గాపురం తదితర లోతట్టు ప్రాంతాలలో ఇప్పటికి మోకాలు లోతు నీటిలో ప్రజలు దుర్వాసనాల మధ్య తమ జీవితాలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడిప్పుడే విద్యుత్తూ సరఫరా అన్ని ప్రాంతాలలో పునరుద్ధరణ జరిగింది.. జరుగుతుంది.. ప్రజల కష్టాలకు రోకలి పోటులా ప్రస్తుతం పట్టణం నడిబొడ్డున ప్రవహిస్తున్న యనమదురు కాల్వ ఉదృతంగా ప్రవహించడం తో పట్టణంలోని మురుగునీరు డ్రైన్స్ ద్వారా ఆ కాలువలోకి వదిలే పరిస్థితి లేదు. నీరు వెనక్కి వచ్చేస్తుంది. గత 7 రోజులుగా ‘కర్మ’ చూసినవారు ఎందరో.. మూడు రైల్వే అండర్ టార్నెల్ లలో నేడు గురువారం నీరు తొలగించడం తో బై పాస్ రోడ్డుకు వెళ్లే ప్రయాణికులు కాస్త ఊరట కలిగింది. లేకపోతె 2 కిలో మీటర్లు చుట్టూ తిరిగి వెళ్ళటమే.. ఫై చిత్రం తాజా చిత్రంలో మెంటేవారి తోటలో చెత్త చెదారం పేరుకొనిపోయిన రోడ్డు ఇళ్లకు సమానంగా ప్రవహిస్తున్న మురుగునీటిలో చెత్తను తొలగిస్తున్న 2 పొకెరెన్స్ మున్సిపల్ శ్రామికుల తిప్పలు చూడవచ్చు.. మరలా వర్షం పడిందా.. ఇక అంతే సంగతులు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *