సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో తాజగా పీజీ వైద్య సీట్లు మరిన్ని పెరిగాయి. రాష్ట్రంలోని 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు 161 కొత్త పీజీ సీట్లను మంజూరు చేస్తూ జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) తాజగా ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 15 స్పెషాలిటీ కోర్సుల్లో ఈ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 2026-27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో 163 పీజీ సీట్లు పెంచాలని ప్రతిపాదనలు పంపగా ఎన్‌ఎంసీ 161 సీట్లకు అనుమతి లభించింది. ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యార్థులకు ఆర్థోపెడిక్స్‌లో 27 సీట్లు, చర్మ, డీవీఎల్, ఈఎన్‌టీ, పాథాలజీ విభాగాలకు 16, రేడియో డయాగ్నసిస్‌కు 14, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ విభాగాలకు 12 చొప్పున మంజూరయ్యాయి. జనరల్ మెడిసిన్, ఎనస్థీషియాలజీ, ఆఫ్తల్మాలజీ, రెస్పిరేటరీ మెడిసిన్ విభాగాలకు ఎనిమిది మంజూరయ్యాయి. ఎమర్జెన్సీ మెడిసిన్, ప్రసూతి-గైనకాలజీ, సైకియాట్రీ, రేడియేషన్ ఆంకాలజీ విభాగాలకు నాలుగు చొప్పున మంజూరయ్యాయి.
