సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు, మంగళవారం కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. అలాగే పలు కీలక విషయాల్లో మంత్రులకు ఆయన దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఇటీవల వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల విజయాన్ని చూసుకొని గర్వంతో విర్రవీగొద్దని మంత్రులకు సీఎం స్పష్టం చేశారు.. ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలని 2029 అసెంబ్లీ ఎన్నికలు మనకు అసలయిన పరీక్ష . ఆ దిశగా అందరం పని చేయాలని అన్నారు.నిత్యావసర ధరలు పెరిగాయని, ఉల్లిపాయ బియ్యం ధరలు కూడా తగ్గించేందుకు ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు. ఇక పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తరువాత గ్రామాలలో సొసైటీ ఎన్నికలు ఉంటాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *