సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు మంగళవారం (నవంబరు 9 )న్యాయ సేవా దినోత్సవం సందర్బంగా మండల న్యాయ సేవా సంస్ధ ఆధ్వర్యంలో కాళ్ళ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అంగన్వాడి కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు తో భీమవరం ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) శ్రీమతి C. రమ్య ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ .. మహిళలు, పిల్లలు, మానసిక వికలాంగులు, షెడ్యూలు కులాలు, తెగలకు చెందినవారు, ప్రకృతి వైపరీత్య బాధితులు, వార్షిక ఆదాయం మూడు సంవత్సరాల లోపువారు అందరూ ఉచితంగా న్యాయ సహాయానికి అర్హులనీ, అటువంటివారు మండల న్యాయ సేవా సంస్ధను సంప్రదిస్తే వారి తరఫున ఉచితంగా న్యాయవాదిని నియమిస్తారని, జాతీయ న్యాయ సేవల చట్టం ద్వారా లోక్ అదాలత్ లు నిర్వహించి కేసులను రాజీ చేస్తున్నామని, అవసరమైన వారికి ఉచితంగా న్యాయ సహాయం అందజేస్తున్నామని, వచ్చే డిసెంబరు 12న భీమవరం లో జరగబోయే జాతీయ లోక్ అదాలత్ ను వినియోగించుకుని కేసులను పరిష్కరించుకోవాలని”పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తితో పాటు డిప్యూటీ మండల ప్రజా పరిషత్ అధికారి T. బాలకృష్ణ మోహన్, ప్యానల్ న్యాయవాదులు, K. సుబ్బరాజు, K. వెంకటరమణ, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ V. V. S. రామరాజు పాల్గొన్నారు.
