సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం విక్టరీ వెంకటేష్ హీరోగా అనేక రిలీజ్ వాయిదాల తరువాత పెద్ద ప్రమోషన్ లేకుండా భారీ ట్రోల్స్ మధ్య అక్టోబర్ 30న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా తీరా చుస్తే మంచి టాక్ వచ్చింది. అప్పటికే జరగాల్సిన అల్లరి జరిగిపోయింది. అయినప్పటికీ ఈ సినిమా గత 20 రోజులకు 85 కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి విక్టరీ వెంకటేష్ సత్తా తో ట్రోలర్స్ కు మతి పోగొట్టింది. అయితే నిర్మాతలు అలసత్యం ఈ సినిమాను 100 కోట్ల క్లబ్ లో చేరకుండా అడ్డుకొంది. అయితే ఈ సినిమాకు ఓటిటి లో మరింత మంచి ఆదరణ ఉంటుందని అందరికి తెలుసు.. అందుకే ఈ సినిమా డిజిటల్ రైట్స్‌పై కూడా భారీ క్రేజ్ నెలకొంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను రూ. 40 కోట్లకు పైగా వెచ్చించి సొంతం చేసుకున్నట్లు సమాచారం. ‘ఆదర్శ కుటుంబం’ నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *