సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పట్టణం లోని వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా భీమవరం నియోజకవర్గానికి చెందిన 7 మంది బాధితులకు 4 లక్షల 90 వేల రూపాయల చెక్కుల ను లబ్దిదారులకు స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అందజేశారు. నేడు, బుధవారం ఉదయం ఉండి మండలం చెరుకువాడ గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి లక్ష తమలపాకులతో నిర్వహించిన పూజా కార్యక్రమంలో గ్రంధి శ్రీనివాస్ పాల్గొని యజ్ఞశాలలో వేదపండితులు నిర్వహించిన దేవత ఆవాహన క్రతువులో కూడా పాల్గొన్నారు.
