సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: రాష్ట్రము లో జగన్ ప్రభుత్వం పేదలపై పగబట్టిందని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఏలూరు జరిగిన మీడియా సమావేశంలో అన్నారు. ప్రభుత్వ ఖజానా ఖాళీ కావడంతో కాసుల కోసం పేదల ఇళ్లపై పై దండయాత్ర చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకు వచ్చింది జగనన్న సంపూర్ణ భూ హక్కు పథకం కాదు.. జగనన్న పైసా వసూళ్ల పథకం అని అన్నారు. పేదలకు రూపాయి కూడా సాయం చేయని జగన్ ప్రభుత్వం ఎప్పుడో పేదలు వారి కష్టార్జితం తో నిర్మించుకున్న నిర్మించిన ఇళ్లకు ఇప్పుడు డబ్బులు చేయడం దుర్మార్గపు చర్య అని ఎమ్మెల్యే రామానాయుడు వ్యాఖ్యానించారు.
