సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఇటీవల రాష్ట్రంలో ప్రభుత్వ ఉడ్జ్యోగసంఘాలు డిమాండ్ చేస్తున్న పీఆర్సీపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, కీలక ప్రకటన చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం జగన్‌ను తిరుపతి సరస్వతీ నగర్‌లో ఉద్యోగుల తరపున కొందరు ప్రతినిధులు కలిసి పీఆర్సీపై విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పీఆర్సీ ప్రక్రియ పరిశీలన పూర్తయిందని, మరో పదిరోజుల్లో సానుకూల ప్రకటన చేస్తామని సీఎం జగన్‌ అన్నారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *