సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పట్టణంలో పవిత్ర పంచా రామం, శ్రీ సోమేశ్వర దేవాలయం, గునుపూడి లో నిన్న రాత్రి జరిగిన లక్ష దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ శ్రీ సోమేశ్వరుని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వేదికపై 365 ఒత్తుల దీపాన్ని మేళతాళాలు , వేదపండితుల వేదమంత్రాల మధ్య వెలిగించిన తదుపరి, విశేషంగా వచ్చిన మహిళా భక్తులు చే లక్ష దీపాలు వెలుగులు తో దేవాలయం ఆవరణ ఆధ్యాత్మిక శోభ చేకూరింది. ఈ పవిత్ర కార్తీక మాసం లో సాక్షాతూ చంద్ర ప్రతిష్టగా భావించే ఈ మహిమానీత శ్రీ సోమేశ్వర సన్నిధిలో ఈ లక్ష దీపోత్సవం లో పాల్గొనడం తన అదృష్టమని , ఆ పరమేశ్వరుని అస్సిసులతో మనందరికీ శుభాలు జరగాలని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. కార్యక్రమాన్ని దేవాలయ ఇఓ, ఎం అరుణకుమార్, సిబ్బంది సహకారంతో పర్యవేక్షించారు
