సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారిని నేడు, శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ కొయ్యే మోషేనురాజు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ సహాయకమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాద్, ఆలయ మర్యాదలతో మోషేను రాజు కు స్వాగతం పలికి, శ్రీ అమ్మవారి దర్శనం వేదమంత్రాలతో అర్చన చేయించి తదుపరి, శ్రీ అమ్మవారి శేష వస్త్రాన్ని, జ్ఞాపిక ను ప్రసాదాన్ని, శ్రీ అమ్మవారి అస్సిసులు అందజేశారు. భీమవరం లో ఒక సామాన్య కౌన్సిలర్ స్థాయి నుండి రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ గా ఎదిగిన మోషేను రాజు తాజగా శ్రీ మావుళ్ళమ్మవారి ని దర్శించుకొని ఓ అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యారు.
