సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. పెద్దలు రోశయ్య గారి మరణవార్త నన్నెంతగానో బాధించింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, శాసనసభ్యుడిగా… సుదీర్ఘ రాజకీయ జీవితంలో పలు పదవులను అలంకరించిన రోశయ్య గారి మృతి రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అంటూ గతంలో స్వర్గీయ వై యస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తాను ఎమ్మెల్యే గా పనిచేసినప్పుడు శాసన సభలో ఆర్ధిక మంత్రి రోశయ్య గారితో తాను పంచుకొన్న అనుభూతులను నెమరువేసుకొన్నారు గ్రంధి శ్రీనివాస్, రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ కొయ్యే మోషేను రాజు .భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ సభ్యులు, అడ్జక్షులు మానేపల్లి గుప్త లు కూడా రోశయ్య మృతి పట్ల సంతాప తీర్మానాలు తెలియజేసారు.
