సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా కొత్త వేరియంట్ కరోనా కేసులు విజృంభిస్తుంటే.. ఇటీవల స్వల్ప స్థాయిలో కొత్త కరోనా కేసులు భారత్ లో వెలుగు చుసిన విషయం అందరికి విదితమే.. అయితే, ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 154 కరోనా కేసులు నమోదు కాగా కరోనా వైరస్ తో నలుగురు మృతి చెందారు. అలాగే రాష్ట్రంలో ఇప్పటివరకు 20,73,730 కరోనా కేసులు చేరగా, కరోనాతో 14,452 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 2,122 యాక్టివ్ కేసులు ఉండగా, 20,57,156 మంది రికవరీ అయ్యారు. గుంటూరులో ఇద్దరు, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. అయితే ప్రజలు ఏ మాత్రం అశ్రద్ధ చెయ్యకుండా మాస్క్ లు ధరించడం మరువకూడదు..
