సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పట్టణంలో తన నివాసం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శాసనమండలి చైర్మెన్ కొయ్యే మోషేను రాజు మాట్లాడుతూ.. సీఎం జగన్ ఆంధ్ర రాష్ట్రము అన్ని ప్రాంతాలు సమన అభివృద్ధి పొందాలని భావించి 3 రాజధానులు బిల్లు ప్రవేశపెట్డం, గత శాసనమండలి లో దానికి అడ్డంకులు రావడం జరిగిందని, అయితే మరోసారి 3 రాజధానుల బిల్లు మండలికి వస్తే దానిని ఆమోదించడం నా హయంలో కచ్చితంగా జరుగుతుందని, ప్రజా అభిష్టానం నెరవేరుతుందని మోషేను రాజు ప్రకటించారు. అలాగే మన భీమవరం అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు, అండగా ఉంటానని, ఆయనతో సమన్వయంతో ముందుకు వెళతానని, ఉభయ గోదావరి జిల్లాలతో నాకున్న అనుబంధం నేపథ్యంలో ఆయా ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వ సహకారంలో నా మద్దతు స్థానిక ఎమ్మెల్యేలు కు అందిస్తానన్నారు. up file photo
