సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: చిత్తూర్ జిల్లా పూతలపట్టు– నాయుడుపేట జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు సంభిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రగిరి సమీపంలో అగరాల వద్ద మలుపునకు ఎన్నో ప్రాణాలు బలవుతున్నాయి. గత ఆదివారం జరిగిన కారు ప్రమాదం లో శ్రీకాకుళం జిల్లా మేడమర్తి గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని ఏడుగురిని ఈ మలుపే బలితీసుకుంది. మేడమర్ గ్రామానికి చెందిన కంచరాపు శ్రీరామమూర్తి(65)తో పాటు అతని భార్య సత్యవతి(55), కుమారుడు సురేష్‌కుమార్(35), కోడలు మీనా (28), మనవరాలు జోష్మిక నందిత(ఏడునెలలు)తో పాటు పూసపాటిరేగకు చెందిన ఆయన వియ్యంకులు పైడి గోవిందరావు(58), వియ్యంకురాలు పైడి హైమావతి(53) చంద్రగిరి వద్ద జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందారు. పెద్ద మనవరాలు జిషిత మాత్రమే ప్రాణాలు దక్కించుకుంది. తిరుపతి నుంచి కాణిపాకం వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. గతంలో ఈ ప్రాంతంలోనే జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తొమ్మిదిమంది కర్ణాటక వాసులు దుర్మరణం పాలవడం స్థానికులు మర్చిపోకముందే మరో ఘటన సంభవించడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
