సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం భీమవరం పట్టణం లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మెన్ కొయ్యే మోషేను రాజు స్థానిక యువకులతో, బాలలతో స్థానిక గునుపూడి లో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత దేశానికీ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ప్రజలకు సమానత్వం తో పాటు, బడుగుల అభివృద్ధికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు బలమైన పునాదిగా నిలిచిందని ప్రశంసించారు.చిన్నారులకు మిఠాయిలు పంపిణి చేసారు. తదుపరి, కుటుంబ సమేతంగా తాడేపల్లి చేరుకొని సీఎం జగన్ ను గౌరవపూర్వకంగా కలవడం జరిగింది.
