సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో హోటల్స్ కు ఇతర వాణిజ్య అవసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ సిలిండర్ రేటును తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయాన్ని ప్రకటించాయి. వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలో రూ.91.50 తగ్గింది. నేటి, గురువారం నుండి (సెప్టెంబర్ 1, 2022) ఈ ధర అమల్లోకి వచ్చింది. దీంతో వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు కొంత ఉపశమనం కలగనుంది. అయితే గృహ అవసరాలకు వినియోగించే డొమెస్టిక్ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. తాజా సవరణతో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1976.07 నుంచి రూ. 1885కు దిగి వచ్చింది. హైదరాబాద్‌లో రూ. 1798.5గా ఉంటుంది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1885కు, ముంబైలో రూ.1844కు లభించనుంది.
