సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం శ్రీరాంపురం లో అనేక శతాబ్దాలుగా వేంచేసి యున్నశ్రీ శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ అమ్మవారికి వెండి చీర తయారు చేయడం కొరకు ఎందరో భక్తులు కానుకలు ఇస్తున్నారు. దీనిలో భాగంగా స్థానిక 32వ వార్డు మాజీ మున్సిపల్ కౌన్సిలర్, మెట్టా మురళీకృష్ణ శ్రీమతి పార్వతి దంపతులు ఈ రోజు అమ్మవారికి 500గ్రాములు వెండిని ఆలయం వద్ద కమిటీ వారికి విరాళంగా అందించారు.ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవఅధ్యక్షులు రౌతు అప్పారావు, కోశాధికారి తాళ్ళపూడి పరమేశ్వరరావు కార్యదర్శి,రౌతు హరిబాబు పాల్గొన్నారు
