సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఉభయ తెలుగు రాష్ట్రాలలోను ప్రఖ్యాతి గాంచిన భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి ఉత్సవాలకు పందిళ్లు, భారీ సెటింగులు, ఏర్పాట్లకు సంబంధించి పనులు నేటి, బుధవారం నుండి ప్రారంభిస్తూ శ్రీ అమ్మవారి దేవాలయ ఆవరణలో చలువ పందిరి ఏర్పాట్లను ప్రారంభించారు. .. వేదమంత్రాల మధ్య మొదటి పందిరిరాట ను ఉత్సవ కమిటీ, నీరుల్లి కాయగూరలు, పండ్ల వర్తక సంఘం సభ్యులు ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. గత ఏడాది కరోనా మహమ్మారి.. నేపథ్యంలో ఉత్సవ దినాలు తగ్గించినప్పటికీ ఈ సారి గతంలో చేసినట్లే 30 రోజులు పైగా ఉత్సవాలు చెయ్యాలని నిర్వాహకులు భావిస్తున్నారు. కొద్దీ నెలల క్రితం ఎక్కడ తగ్గకుండా .. శ్రీ అమ్మవారి జేష్ఠమాస జాతర కూడా ఘనంగా నిర్వహించిన నేపథ్యంలో.. శ్రీ అమ్మవారి అస్సిసులతో వచ్చే జనవరి 13 నుండి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి వార్షిక మోహోత్సవాలు జయప్రదం కానున్నాయి.
