సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతిలో శ్రీవారిని గత ఆగస్టు నెలలో 22 లక్షల 22వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక ఈ ఒక్కనెలలోనే ఏకంగా 140 కోట్ల 34 లక్షల రూపాయలు పైగా హుండీ ఆదాయం రావడం అల్ టైం రికార్డుగా ప్రకటించారు దేవాలయ అధికారులు. అయితే గత జులై నెలలో 139 కోట్ల ఫై చిలుకు ఆదాయం వస్తే మరుసటి నేల దానిని మించిన ఆదాయం రావడం విశేషంగా చెప్పుకోవాలి. గత ఆగస్టు నెలలో 10లక్షల 84 వేల మంది భక్తులు శ్రీవారి కోసం తలనీలాలు సమర్పించారు.
