సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: తెలుగు రాష్ట్రాలలో నేడు, గురువారం అన్ని ప్రాంతాలలో శ్రీ సుబ్రమణ్య షష్ఠి వేడుకలు ఘనంగా నిర్వహించుకొంటున్నారు. ఈ నేపథ్యంలో భీమవరంలో శ్రీరామపురం శ్రీ రామలింగేశ్వర స్వామి గుడి వద్ద వేలాది మంది భక్తులు నేటి తెలవారుజామునుండి క్యూ లైన్ లో నిలబడి మహిమానిత శ్రీ వల్లి దేవసేన సుబ్రమణ్యేశ్వరుని దర్శనం , పాలాభిషేకాలు నిర్వహించారు. ( ఫై తాజా చిత్రంలో చూడవచ్చు) పోలీసులు భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఇంకా పంచారామ క్షేత్రం, శ్రీ భీమేస్వర స్వామి దేవాలయం, మారుతి సెంటర్ లోని నాగేంద్రుని దేవాలయంలలో భారీగా భక్తులు స్వామివారికి పూలు పడగలు సమర్పించి, ఆవుపాలతో పాలాభిషేకాలు నిర్వహించారు. గత 3 రోజులుగా కూరుతున్న తేలికపాటి వర్షపు జలులుతో వాతావరణం కూడా నేటి ఉదయం ఎంతో ఆహ్లదంగా ఆధ్యాత్మిక శోభ ను మరింత పెంచింది. శ్రీరామపురం లో రేపు శుక్రవారం సాయంత్రం నిర్వహించే రధోత్సవం కు ఏర్పాట్లు చేస్తున్నారు.
