సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: దేశంలో రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు(ఆర్‌ఆర్‌బీ) నియామక పరీక్షల్లో 4,85,607 అభ్యర్థుల దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్లు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఒక సంచలన ప్రకటనలోచేసింది. . 2019లో విడుదలైన నోటిఫికేషన్‌లోని పోస్టులకు సంబంధించి వచ్చిన దరఖాస్తుల్లో.. 4.85 లక్షల మంది ఫొటోలు/సంతకాల్లో తేడాలున్నాయని వివరించింది. దక్షిణ మధ్య రైల్వే(ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర) పరిధిలో సుమారు 26 వేల మంది దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్లు పేర్కొంది. అలాంటి అభ్యర్థులకు ఈ నెల 15 నుంచి 26 వరకు ఫొటోలు, సంతకాలను తిరిగి అప్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని ప్రకటించింది. వీటి ఆమోదం విషయంలో ఆర్‌ఆర్‌బీదే తుది నిర్ణయమని స్పష్టం చేసింది.కాగా.. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి దశలవారీగా జరుగుతాయని వివరించింది. కొవిడ్‌ నేపథ్యంలో కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌ పరీక్షల(సీబీటీ)ను నిర్వహిస్తామని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *