సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం శ్రీరామలింగేశ్వర స్వామి గుడి వద్ద శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కల్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు, శనివారం రాత్రి 7 గంటలకు సమీపంలోని పంటకాలువలో హెంసతూలిక తెప్పఫై, శ్రీ స్వామివారి తెప్పోత్సవం, బాణసంచా కాల్పుల మధ్య నిర్వహించడానికి ఏర్పాటు చేసారు. ఇక నిన్న శుక్రవారం సాయంత్రం నుండి రాత్రి వరకు జరిగిన భీమవరం శ్రీరాంపురంలోని రామలింగేశ్వరస్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. ప్రత్యేకంగా పూలమాలలు తో అలంకరించిన శ్రీ వల్లి దేవసేన సుబ్రమణ్య స్వామివార్ల కల్యాణమూర్తులైన ఉత్సవ విగ్రహాలు రథంపై అస్సినులయి ఉండగా, మేళతాళాలతో బాణసంచా కాల్పుల మధ్య రథోత్సవం ముందుకు సాగింది. ఈవో దండు కృష్ణంరాజు, పోలీస్ అధికారులు పర్యవేక్షించారు. తీర్ధంలో భాగంగా ఏర్పాట్లు చేసిన 2జాయింటు వీల్స్, టొరాంటోర, ట్రైన్ తదితర వినోద ఎగ్జిబిషన్ ఆబాల గోపాలాన్ని అలరిస్తుంది. ఇక గత రాత్రి 10 గంటల వరకు అందమైన లైటింగ్ వెలుగుల మధ్య భారీ తీర్ధ తిరునాళ్ళు మధ్య వేలాది భక్తులు, యువత చేసిన కోలాహలం అంత ఇంతాకాదు.
