సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం లో పండుగలు,దేవాలయాల వద్ద వేడుకలు, వాటికీ హాజరు అయ్యే భక్తుల తాకిడి జిల్లాలో మరెక్కడా ఉండదంటే అతిశయోక్తి కాదు. వారి భద్రతా ఏర్పాట్లకు కేవలం పోలీసులు మాత్రమే సరిపోరు. ఎన్ సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడేట్లు, వాలంటర్ల కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. అందుకే వీరిని అభినందించడానికి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అవరణలో శ్రీ విజ్ఞాన వేదిక అధ్వర్యంలో ఎన్ సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడేట్లు, వాలంటర్లకు ప్రశంసా పత్రాలు అందించారు. సిఐ కృష్ణభగవాన్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా కార్తీక మాసంలో గునుపూడి సోమేశ్వరాలయంలోనూ, సుబ్రహ్మణ్య స్వామి షష్టి వేడుకల్లో ఎన్ సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడేట్లు ఎంతో సేవలు అందిస్తున్నారని, వారి సేవలు అమొఘమని అన్నారు. అనంతరం వారికి సిఐ చేతుల మీదుగా ప్రశంసా పత్రలను అందించి అభినందించారు. కార్యక్రమంలో సోమేశ్వర స్వామి దేవస్థానం ఈవో అరుణ్ కుమార్, చెరుకువాడ రంగ సాయి, కెప్టెన్ కే భారత్, నరహరి శెట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
