సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం పెదగరువు గ్రామపంచాయతీ పరిధిలోని చినగరువులో ఈ పనులకు సంబంధించి నేడు, మంగళవారం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహ రాజు అధ్యక్షతన జరిగిన భారీ బహిరంగ సభలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ .. ప్రతి ఇంటికి మంచినీటి కొళాయి కనెక్షన్లు ఏర్పాటుచేసి స్వచ్ఛమైన త్రాగునీటిని అందించడమే లక్ష్యంగా సీఎం జగన్ పని చేస్తున్నారని మన భీమవరం నియోజకవర్గంలో 30 గ్రామాలకు సంబంధించి 64 ఆవాస ప్రాంతాలకు ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూ 20 కోట్ల ఐదు లక్షల నిధులను జలజీవన్ మిషన్ పథకంలో మంజూరు చేసారని, అయితే రెండవ విడతగా మరో 26 కోట్ల నిధులు మంజూరు చేసే విధంగా ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలనుకూడా పంపడం జరిగిందని తెలుపుతూ.. త్రాగునీటి కుళాయిల పనులు శరవేగంగా పూర్తీ చేస్తామన్నారు. మొదటి విడత పనుల ప్రారంభానికి చిన గరువు లో శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. సుమారుగా 106 కిలోమీటర్ల మేర పైపులైన్లను వేయడం జరుగుతుందని, 13 ఓ హెచ్ ఆర్ లను నిర్మిస్తామని, 13 ఎస్ఎస్ ఫిల్టర్స్ లను నిర్మిస్తామని, నాలుగు సంపు వెల్ లు నిర్మిస్తామని పేర్కొన్నారు. తదుపరి, భీమవరం పట్టణంలోని 13వ వార్డు లో .40 లక్షల రూపాయలతో యర్రంశెట్టి వారి వీధి అనుసంధానంగా ఉన్న అడ్డ వీధులు మరియు ఏలూరి చల్లారావు ఇంటి నుండి పసుపులేటి ఆదిలక్ష్మి ఇంటి వరకు సి సి రోడ్లు, సీసీ డ్రైన్ల్ నిర్మాణాలు చేపడుతూ శ్రీ ఉమా సోమేశ్వర స్వామి స్కూల్ నందు శంకుస్థాపన చేశారు .
