సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సూపర్ స్టార్ కృష్ణ ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. సూపర్ స్టార్ మహేష్‌బాబుకు మాతృవియోగం కలిగింది. సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ సతీమణి శ్రీమతి ఇందిరాదేవి నేడు, బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరాదేవి నివాసంలోనే తుది శ్వాస విడిచారు. కృష్ణా మొదటి భార్య ఇందిరాదేవికి ఐదుగురు సంతానం. రమేష్‌బాబు, మహేష్‌బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని. ఇందిరాదేవి మృతితో ఘటమనేని కుటుంబంతో పాటు..టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రిన్స్ మహేష్ బాబు..ఇందిరాదేవి బర్త్ డే రోజున, మదర్స్ డే రోజున, విమెన్స్ డే రోజున ప్రత్యేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి తనకు తల్లి పట్ల ఉన్న మమకారాన్ని అభిమానులతో పంచుకునేవారు. ఎన్నో ఎదురుదెబ్బలు, ఎన్నో అపూర్వ విజయాలు చవిచూసిన తెలుగువారు గర్వపడే ఒక వ్యవస్థగా ఎదిగిన రియల్ హీరో “మంచి మనిషి” కృష్ణ కు 80 ఏళ్ళ పెద్ద వయస్సులో ఇన్ని కష్టాలా ?ఇటీవల కాలంలోనే.. తనకు చేదోడుగా నిలచిన విజయ నిర్మల ను , కుమారుడు రమేష్ బాబు ను ఇప్పుడు ఇందిరాదేవి ని వరుసగా కొద్దీ కొద్దీ నెలల విరామం తో వరుసగా కోల్పోవడం, తెలుగు వారు అందరిలో విషాదాన్ని నింపుతుంది. కృష్ణ నివాసం వద్ద మహేష్ బాబు ఇతర కుటుంబ సభ్యులతో పాటు తెలుగు సినీ ప్రముఖులు సందర్శన తో పాటు నాగార్జున, మోహన్ బాబు, కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
